ఆయన చేతిలోనే దేశం భద్రం : బాబా రాందేవ్‌

Baba Ramdev Claims Crores of Funding Being Pumped by Christian And Islamic Nations to Prevent Modi Win - Sakshi

జోధ్‌పూర్‌ : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతిలోనే దేశం భద్రంగా ఉంటుందని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ తెలిపారు. మోదీని ఓడించడానికి దేశ వ్యతిరేక శక్తులు కోట్ల రూపాయలను సమకూర్చుతున్నాయన్నారు.  బుధవారం బీజేపీకి మద్దతుగా జైపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన  మాట్లాడుతూ.. ‘ప్రపంచమంతా భారత ఎన్నికలపైనే దృష్టిసారించింది.  ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రావద్దని దేశ వ్యతిరేక శక్తులు, ముస్లిం, క్రిస్టియన్‌ దేశాలు కోట్ల రూపాయలను సమకూర్చుతున్నాయి.  అసలు మోదీ ఏం తప్పు చేశారు? దేశం సంక్షేమం కోసం పాటుపడుతున్నారు.  దేశ అభివృద్ధి కోసం 24 గంటలు పనిచేస్తూనే ఉన్నారు. ఎలాంటి స్వప్రయోజనాల కోసం పని చేయలేదు. ఆయనకు కుటుంబం లేదు. సొంత ఇల్లు లేదు. అలాంటి మోదీకి మనమంతా మద్దతుగా నిలవాలి. అతని చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుంది. సైనికులు, మహిళలు, రైతులు అందరికి రక్షణ, భరోసా ఉంటుంది.’ అని బాబా రాందేవ్‌ ప్రజలకు సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top