బీజేపీతో పొత్తు.. విషం తాగినట్లే | Sakshi
Sakshi News home page

బీజేపీతో పొత్తు.. విషం తాగినట్లే : ముఫ్తీ

Published Mon, Jul 30 2018 8:24 PM

Alliance With BJP Like Drinking Poison Says Mufti - Sakshi

శ్రీనగర్‌ : బీజేపీతో పొత్తు అంటే విషం తాగినట్లే అని జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌ మాజీ సీఎం ముఫ్తీ మహ్మద్‌ సయ్యద్‌ మరణాంతరం మెహబూబా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పీడీపీతో విభేదించిన బీజేపీ రెండేళ్ల కూటమి అనంతరం పీడీపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. ముఫ్తీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీతో కూటమి అంటే విషయం తాగినట్లే. రెండేళ్లు వారితో కలిసి ప్రభుత్వాన్ని నడిపాను. ఆ బాధ ఏలా ఉంటుందో నాకు తెలుసు.

గతంలో వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అందుకే రెండోసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. కానీ అప్పుడున్న నాయకత్వానికి.. ఇప్పటికి చాలా తేడా ఉంది. రెండోసారి పోత్తు పెట్టుకోవడం చాలా కఠినమైన నిర్ణయమే’ అని వ్యాఖ్యానించారు. పీడీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ముఫ్తీపై తిరుగుబాటుకు ప్రయత్నించిన ఘటన కశ్మీర్‌లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో సీఎం రాజీనామా చేయగా.. ప్రస్తుతం కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన అమలులో ఉంది.

Advertisement
Advertisement