మాయావతి షాక్‌ : అఖిలేష్‌తో కాంగ్రెస్‌ మంతనాలు

After Mayawatis Snub Congress Now Eyes Alliance With Samajwadi Party  - Sakshi

భోపాల్‌ : బీఎస్పీ అధినేత్రి మాయావతి పొత్తుకు ససేమిరా అనడంతో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ కమల్‌ నాథ్‌ ఈ అంశాన్ని ధృవీకరించారు. కొద్దిరోజుల కిందట అఖిలేష్‌తో పొత్తుకు సంబంధించి తాను మాట్లాడానని, దీనిపై సం‍ప్రదింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇస్తూ మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. బీఎస్పీ తమకు అందించిన సీట్ల జాబితాలో ఆ పార్టీ గెలిచే స్ధానాలు లేవని, ఓడిపోయే స్ధానాలను కోరడంతోనే బీఎస్పీతో పొత్తు ప్రయత్నాలకు విఘాతం కలిగిందని కమల్‌ నాధ్‌ చెప్పారు. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ కాదని, క్షేత్రస్ధాయిలో కాంగ్రెస్‌కు మంచి ఆదరణ కనిపిస్తోందన్నారు. ఓట్ల చీలికతో బయటపడాలని బీజేపీ భావిస్తోందని దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top