బీజేపీలో చేరిన నటి జయలక్ష్మి

Actress Jayalaxmi Join in BJP Tamil Nadu - Sakshi

చెన్నై, పెరంబూరు: నటి జయలక్ష్మి రాజకీయరంగప్రవేశం చేసింది. ఈమె బుధవారం కేంద్రమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ సమక్షంలో బీజేపీలో చేరింది. ముత్తుక్కు ముత్తాగ, పాండినాటి కుటుంబత్తార్, వేట్టైక్కారన్‌ వంటి కొన్ని చిత్రాల్లో నటించిన జయలక్ష్మి ప్రియానవలే వంటి  కొన్ని టీవీ సీరియళ్లలోనూ నటించింది. అలాంటిది హఠాత్తుగా రాజకీయాలపై దృష్టి సారించి  బీజేపీ తీర్థం పుచ్చుకుంది. జయలక్ష్మి మాట్లాడుతూ తమిళనాడులో డ్రావిడ పార్టీలున్నా అవినీతి రాజ్యమేలుతోందని అంది. అందుకే ఏదైనా జాతీయ పార్టీలో చేరి సేవలందించాలని భావించానంది.

అంతే కాకుండా తాను ప్రధాని నరేంద్రమోదికి వీరాభిమానినని పేర్కొంది. బీజేపీలో చేరాలన్న ఆసక్తి చాలా కాలంగా ఉందని తెలిపింది.నరేంద్రమోది తమిళనాడుకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి బీజేపీలో చేరానని చెప్పింది. తమిళనాడులో కమలం వికసించడానికి తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పింది. చైనా అధ్యక్షుడితో ప్రదానమంత్రి మహాబలిపురంలో కలయిక ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించిందని అంది. తాను ఇప్పుటికే సినీ రంగంలో ఉంటూ సామాజిక సేవ చేస్తున్నాననీ, ఇప్పుడు జాతీయపార్టీలో చేరి ప్రజలకు మరింత  సేవలందించవచ్చునని నటి జయలక్ష్మి పేర్కొంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top