అదే చంద్రబాబు నైజం : పృథ్వీరాజ్‌ | Actor Prudhvi Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘మహిళలను అగౌరవ పరచడం చంద్రబాబు నైజం’

Jan 14 2019 9:15 PM | Updated on Jan 14 2019 9:24 PM

Actor Prudhvi Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, నెల్లూరు : మహిళలను అగౌరవపరచడం చంద్రబాబు నాయుడు నైజమని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత పృథ్వీరాజ్‌ విమర్శించాడు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి ఇదే చివరి సంక్రాంతి పండుగ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యప్రజలకు తెలిసేలా త్వరలో వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామని చెప్పారు. చంద్రబాబు చేసిన మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని తెలిపారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల పథకాలపై త్వరలో గ్రామాల్లో ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement