కేజ్రీవాల్‌ దారిలోనే ఆప్‌ నేతలు

AAP Leader Kumar Vishwas Ask Apologize To Arun Jaitley - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నడిచిన అడుగుజాడల్లోనే ఆప్‌ నేతలు పయనిస్తున్నారు. ఇటీవల కేజ్రీవాల్‌పై ఉన్న పరువు నష్టదావా నుంచి తప్పించుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ సారీల పర్వం ముగియగానే ఆప్‌ నేతలు కూడా అదేపందాను అనుసరిస్తున్నారు. తాజాగా మరో ఆప్‌నేత కుమార్‌ విశ్వాస్‌ తాను చేసిన అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకుంటున్నట్లు, తన మీద ఢిల్లీ హైకోర్టులో వేసినే పరువు నష్టం దావాను ఉపసంహరించుకోవాలని అరుణ్‌ జైట్లీకి లేఖ రాశారు.

కుమార్‌ లేఖకు స్పందించిన జైట్లీ పరువు నష్టం దావాను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. గతంలో కూడా కేజ్రీవాల్‌తో సహా ఆప్‌ నేతలు సంజయ్‌ సింగ్‌, అశుతోష్‌, దీపక్‌, రాఘవ్‌ చంద్రాలపై తన మీద అసత్య ఆరోపణలు చేసినందుకు పదికోట్లు చెల్లించాల్సిందిగా 2015లో ఢిల్లీ హైకోర్టులో జైట్లీ పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌తో సహా ఇతర నేతలు క్షమాపణలు కోరడంతో పిటిషన్‌ను జైట్లీ వెనక్కి తీసుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top