టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ

Kuppam TDP Candidate Janardhan Rejected By Returning Officer - Sakshi

సాక్షి, విజయనగరం: ఎన్నికలకు ముందే అధికార టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జనార్ధన్‌ ధాట్రాజ్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. నామినేష‌న్ల ప‌రిశీల‌న సంద‌ర్భంగా టీడీపీ అభ్య‌ర్ధి అఫిడివిట్‌లో దాఖలు చేసిన కుల ధ్రువీకరణ పత్రంపై ప్రత్యర్థి అభ్యర్థులు అభ్యంతరం వ్య‌క్తం చేశారు. జనార్ధన్‌ ధాట్రాజ్‌ ఎస్టీ కాదని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిని పరిశీలించిన అధికారి విశ్వేశ్వరరావు.. జనార్ధన్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీం​తో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు భారీ షాక్‌కు గురైయ్యారు. కాగా నామినేషన్‌ పేపర్లలో తప్పిదం కారణంగా తీవ్ర ఉత్కంఠ అనంతరం నారా లోకేష్‌ నామినేషన్‌ను అధికారులు ఆమోదించిన విషయం తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top