
సాక్షి, కృష్ణా : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా గన్నవరంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ 145వ రోజు ప్రజాసంకల్పయాత్రను బుధవారం ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం దావాజీగూడెం శివారు నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు.
అక్కడి నుంచి ఉంగటూరు మండలం వెన్నూతల, తుట్టగుంట క్రాస్ రోడ్డు, వెల్దిపాడు క్రాస్ రోడ్డు, నాగవరప్పాడు, ఎలకపాడు క్రాస్ రోడ్డు, ఉంగుటూరు, ఆముదాల పల్లి క్రాస్ రోడ్డు, లంకపల్లిల మీదుగా వెంకట రాంపురం వరకూ పాద్రయాత్ర కొనసాగనుంది.