ఈ తరహా జాతీయవాదం వద్దే వద్దు...! | no need of this type of nationality | Sakshi
Sakshi News home page

ఈ తరహా జాతీయవాదం వద్దే వద్దు...!

Aug 23 2015 4:46 AM | Updated on Sep 3 2017 7:56 AM

ఈ తరహా జాతీయవాదం వద్దే వద్దు...!

ఈ తరహా జాతీయవాదం వద్దే వద్దు...!

శత్రువుతో గుసగుసలాడుతారనే భయం కారణంగా మన సొంత పౌరులనే నిర్బంధించడం ద్వారా ‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక’ భారతఖను మనం అవమానిస్తున్నాం.

శత్రువుతో గుసగుసలాడుతారనే భయం కారణంగా మన సొంత పౌరులనే నిర్బంధించడం ద్వారా ‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక’ భారతఖను మనం అవమానిస్తున్నాం. ఇలాంటి చర్యల ద్వారా మనది ఆత్మవిశ్వాసం కలిగిన రిపబ్లిక్ కాదని మనకు మనం ప్రదర్శించుకుంటున్నాం. మనకు ఏ ప్రయోజనం ఒనగూరకపోయినా సరే... మనం అవతలిపక్షాన్ని శత్రువైఖరితోనే చూస్తుండాలనే సంకుచితత్వాన్ని నేను ఇకపై ఆమోదించలేను.

పాకిస్తాన్తో భారత్ యుద్ధానికి తలపడుతున్నట్లు కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టెలివిజనఖ విశ్లేషకుడిగా నెట్టుకు రావడం ఏమంత సులభమైన విషయం కాదు. అయితే అది నిజమైన యుద్ధం కాదనుకోండి. పొఖ్రానఖ, చాగైలో ఆ మతి హీన పేలుళ్లు (అణుపరీక్షలు) జరిపిన తర్వాత మనకు అలాంటి పరిస్థితి ఇక ఎదురు కాదు కూడా. మనం మాట్లా డుకోవాలా లేదా అనే విషయంలో ఈ చిన్న పిల్లల తరహా వాగ్వాదంపైనే నేనిలా అంటున్నాను... ఎవరైనా తల్చుకుంటే టెలిఫోన్, ఇమెయిల్ ఇతరత్రా మార్గాల్లో సులభంగా ఏ సమాచారాన్నయినా పంపిణీ చేసుకోగలుగుతున్న నేటి కాలంలో ప్రజలను కలుసుకోకుండా మనం ఎందుకు ఆపుతున్నామో అర్థం చేసుకోవడం నాకయితే కష్టమే. అంత ర్జాతీయ దౌత్యంలోని సూక్ష్మభేదాలను బహుశా నేను అర్థం చేసుకోవడం లేదేమో మరి. మూర్ఖత్వంతో, మొండితనంతో ఉండటం కూడా వాస్తవానికి చాణక్య మేథకు సంబంధించిన ఒక యుక్తిగా నాకు అనిపిస్తుంటుంది.

ఏమయినప్పటికీ, నేను చెబుతున్నదేమిటంటే, స్వతంత్ర బుద్ధి కలిగిన వారు ఈ రోజుల్లో విశ్లేషకులుగా ఉండటం అంత సులభం కాదనే. టీవీ స్టూడియోలో ఉన్న ఇతరులకు ఇది చాలా సులభమే కావచ్చునేమో కానీ పార్టీ పంథాను లేదా జాతీయ పంథాను అవలంబించడం నాకయితే సాధ్యం కాని పని. నా అభిప్రాయంలో వాస్తవం, సందర్భం అనేవి చాలా ముఖ్యమైనవి. చాలాకాలంగా నేను అంధ జాతీయ వాద దృష్టిని కలిగి ఉండేవాడిని కానీ ప్రపంచాన్ని చదువుతూ, దాన్ని ఎదుర్కొంటూ ఉన్న వారు ఎవరైనా తామున్న స్థితి నుంచి మరింత పరిణతి చెందుతారు. ప్రాంతీయ జాతీయవాద స్వభావం శూన్యతతోనే ఉం టుందని ఎవరైనా అర్థం చేసుకుంటారు. అంటే మీరు నష్ట పోతున్నప్చడు లేదా నష్టపోతున్నట్లు కనిపిస్తున్నప్చడు మాత్రమే నేను లాభపడతానని దీని అర్థం. మీకు కలిగే
ప్రయోజనం నాకు నష్టంగా పరిణమిస్తుంది.

భారత్లో మన జాతీయవాద వైఖరి ఏమిటి? అది పాకిస్తాన్, చైనా వ్యతిరేక వైఖరే. ఇది ఎలాంటి సూక్ష్మ భేదాన్ని కూడా అనుమతించదు. మనం దీనికి పూర్తిగా ఆమోదమైనా తెలపాలి లేదా పూర్తిగా విరోధించక పోయి నా, కనీసం తిరస్కరిస్తున్నట్లయినా కనిపించాలి. మనకు నష్టం జరుగుతున్నా సరే, లేదా అలాంటి వైఖరి వల్ల భార తఖకు ఎలాంటి ప్రయోజనం కలగకున్నా సరే.. మనం ఎన్న టికీ పాకిస్తానఖ వ్యతిరేకతనే కలిగి ఉండాలి మరి. (హురి యతఖ వేర్పాటువాదులను కలిసేందుకు అనుభవజ్ఞుడైన సర్తాజ్ అజీజ్ను అనుమతించకపోవడంలో భారతఖకు ఒరిగే ప్రయోజనం శూన్యమే).

శత్రువుతో గుసగుసలాడుతారనే భయం కారణంగా మన సొంత పౌరులను నిర్బంధిస్తున్నప్చడు, ‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక’ భారత్ను మనం అవమాని స్తున్నాం. ఇలాంటి చర్యల ద్వారా మనది ఆత్మ విశ్వాసం కలిగిన రిపబ్లిక్ కాదని మనకు మనం ప్రద ర్శించుకుం టున్నాం. ఏమాత్రం కొత్తగా ఆలోచించడానికి సిద్ధపడని విశ్లేషకుడికి ఇది చాలా స్పష్టతను ఇవ్వగలగాలి. పైగా దీన్ని టెలివిజనఖలో ప్రకటించడం అనేది జాతీయ వ్యతిరేకిగా ఉంటున్నారని ఆరోపణలకు గురయ్యేలా చేస్తుంది.

మరొక విషయం ఏమిటంటే ఒక ప్రత్యేక సందర్భంలో ఎవరైనా ఒక నిర్దిష్ట దృక్పథానికి కట్టుబడి ఉన్నప్చడు ఇలాంటి ఆరోపణలకు గురవడం. తర్కం, హేతువు నుంచి తప్పించుకోలేని ఒకరకమైన సిద్ధాంతంతో మనందరం రం గేసుకున్నాం అని మనపై నేరారోపణ చేస్తుంటారు. మనం నిర్దిష్టంగా అర్థం చేసుకోకుండానే లె?ఫ్ట, లిబరలఖ, రైటఖ అనే పదాలను అలవోకగా వాడేస్తుంటాము. దీనికి ఒక కారణ ముందని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే, హిందు వులకు ఎలాంటి అనుకూలతను కలిగించకున్నా, ముస్లిం లకు, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఆగ్రహం, వైరం ప్రతి పాదిం చే హిందూత్వం వంటి విద్వేషంపై ఆధారపడిన వర్గీకరణ లను మనం కలిగి ఉన్నాం.
ఇలాంటి విద్వేషాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తులు ఎలాంటి సమస్యకు సంబంధించి అయినా సరే.. తమ బుద్ధిని, తమ ఉద్వేగాలను వేరుపర్చుకోవడం కష్టం. అయి తే మనం అలాంటి వారి వెనుక ఎందుకు నిలబడాలి. నా వరకు నేను ఆ వరుసలో నిలబడను, నిలబడలేను కూడా.

‘‘చర్చలు విఫలమైతే పాకిస్తానఖనే తప్చపట్టవచ్చనే అంశంపై స్టూడియోలో ఉన్న మనమంతా అంగీకరిస్తు న్నాం’’ అంటూ ఒక యాంకర్ ఓ చర్చా కార్యక్రమంలో పేర్కొన్నారు. కాని ఆ చర్చలో నేను దానికి అంగీకరించ లేదు. ఇది ఇండియా వెరసి పాకిస్తానఖకు సంబంధించిన సమస్య కాబట్టి భారతీయులందరూ తమ ప్రభుత్వ వైఖరిని బలపర్చాలని ఇలాంటి వారు భావిస్తున్నారు.

ఇప్పటికే రేఖలను గీసేశారు.. ఇక ఇరుపక్షాలూ సమరా నికి పోవడమే తరువాయి అని ఈ భావనకు అర్థం. విశ్లేష కులు, రాజకీయనేతలు, పౌరులు, క్రికెటర్లు, లేదా గృహిణు లు ఇలా మనందరం అవతలి పక్షాన్ని శత్రువుగానే చూడా లి, పైగా ఆ శత్రుపక్షం చెప్పే ప్రతి అంశాన్నీ వ్యతిరేకించాలి. దాన్నుంచి మనకు ఏ లబ్ధి ఒనగూరకపోయినా సరే మనం అవతలిపక్షాన్ని అలాగే చూస్తుండాలి. ఇలాంటి మూర్ఖ త్వాన్ని, మూఢత్వాన్ని నేను ఏమాత్రం ఆమోదించను. దీంతో టీవీలో కనిపించటం నాకు కష్టంగానే ఉంటుంది.


మరి ఇలాంటి వైఖరిని ఎంతగానో ద్వేషిస్తూ లేదా కనీసం అసంతృప్తిగా చూస్తూ మీరెందుకు ఇంకా టీవీ ప్రసా రాల్లో కనిపిస్తున్నారు? అని ఎవరైనా బుద్ధిమంతులు నన్ను అడగవచ్చు. దీనికి కారణం ఏమిటంటే ఈ పని చేయడానికి నాకు డబ్బు చెల్లిస్తున్నారు. పైగా తరచుగా కాకున్నా కొన్ని సార్లయినా టీవీలో కనిపించడాన్ని నేను ఆస్వాదిస్తుంటాను కూడా. మరొక కారణం ఏదంటే నాలాగే మరి కొందరు కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు. వారి సంఖ్య ఏమంత పెద్దది కాక పోవచ్చు కానీ, ఉన్మాదాన్ని, అల్పత్వాన్ని తిరస్కరించే మావంటి బృందం ఒకటి ఉంటుందని విశ్వసించడాన్ని నేను ఇష్టపడతాను.


(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) ఆకార్ పటేల్, aakarpatel@icloud.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement