‘గ్యాస్’ మాటలేనా! | No clarity to implemention on Gas Cash transfer scheme | Sakshi
Sakshi News home page

‘గ్యాస్’ మాటలేనా!

Nov 23 2014 1:18 AM | Updated on Sep 2 2017 4:56 PM

గతంలో యూపీఏ సర్కారు ప్రవేశపెట్టిన గ్యాస్‌కు నగదు బదిలీ పథకం అప్పట్లోనే అయోమయంగా మారింది.

ఇన్ బాక్స్:  గతంలో యూపీఏ సర్కారు ప్రవేశపెట్టిన గ్యాస్‌కు నగదు బదిలీ పథకం అప్పట్లోనే అయోమయంగా మారింది. మళ్లీ ఇప్పుడు తాజాగా గ్యాస్‌కు నగదు బదిలీ పథ కం అమలు చేస్తామని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటిం చింది. పథకాలను ప్రవేశపెట్టిన తరు వాత దాని అతీగతీ పట్టించుకోరు. దీని వల్లే అనేకమంది సమిథలుగా మారు తున్నారు. గ్యాసును తీసుకోవడానికి పని మానేసి ఉద్యోగులు, కూలిపను లకు వెళ్లేవాళ్లు నిరీక్షిస్తున్నారు. ఆధార్ అనుసంధానం చేసి సబ్సిడీని బ్యాంకులో వేస్తామని చెప్పి వారం రోజు లు గడువు విధిస్తూ వినియోగదారులకు మొబైల్ ద్వారా సందేశాలు పంపుతున్నారు. సబ్సిడీలు బ్యాం కులో వేయడంకన్నా, ఇప్పుడు ఉన్న పద్ధతిని అవలం బిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. సబ్సిడీలు తప్పుదారి పట్టకుండా పకడ్బందీగా గ్యాస్‌ను అందిం చేందుకు కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
 జైని రాజేశ్వర్ గుప్త  కాప్రా, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement