మేరీలాండ్‌లో వైఎస్సార్‌సీపీ విజయోత్సవ వేడుకలు..

YSRCP Victory Celebrations AT Maryland - Sakshi

మేరీలాండ్ : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా అమెరికా మేరీలాండ్‌లోని ఆ పార్టీ కమిటీ సభ్యులు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్‌ స్థానాలు గెలుచుకుని విజయ దుందుభి మోగించడం తమకు ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ వేడుకలకు మేరీలాండ్‌ పరిసర ప్రాంతాల్లోని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. దాదాపు 500 మంది సకుంట సమేతంగా ఒకే వేదికను పంచుకోవడంతో.. ఈ సభ ఏపీలో జరుగుతున్నందనే అనుభూతినిచ్చింది. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు తెలుగుదనం ఉట్టిపడేలా చేసిన ఏర్పాట్లను చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మేరీలాండ్‌ వైఎస్సార్‌సీపీ ఆర్గనైజర్స్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ సీపీ సాధించిన విజయం ప్రతి ఒక్క కార్యకర్త విజయమని అన్నారు. ఇంతటి అద్వితీయ విజయాన్ని అందించిన కార్యకర్తలకు , సోషల్‌ మీడియా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. దివంగత మహానేత వైఎస్సార్‌ పాలనను మరిపించే విధంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందించాలన్నారు. వైఎస్‌ జగన్‌ పాలనలో  రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సభ్యులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజలు మరిచిపోయేలా.. వైఎస్సార్‌ సీపీ పాలనలో సంక్షేమ ఫలాలు వారికి చేరుతాయని అన్నారు. వైఎస్సార్‌ సీపీ భవిష్యత్తులో మరిన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చిన్నారుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తయారుచేయించిన తెలుగింటి వంటకాలను సభకు హాజరైన వారికి వడ్డించారు. 

ఈ కార్యక్రమాన్ని ప్రసన్న కాకుమాని, పార్థ బైరెడ్డి, పవన్‌ ధనిరెడ్డి, రవి బారెడ్డి, కోట్ల తిప్పారెడ్డి, వెంకట్‌ ఎర్రం, రాజ్‌ ఎరమల, భాస్కర బొమ్మారెడ్డి, సుదర్శన్‌ దేవిరెడ్డి, నర్సారెడ్డి, సురేశ్‌ కుప్పిరెడ్డి, నోయల్‌ కట్ట, జితేంద్ర సాయి పైడిమర్ల, ప్రతాప్‌ కాకర్ల, రామ్‌గోపాల్‌ దేవపట్ల, మురళి బాచు, వెంకట్‌ కీసర, ఆశోక్‌ చిట్టెల, నాగిరెడ్డి, గిరిధర్‌ బండి, శివ పిట్టు, శ్రీనివాస్‌ పూతన, రాజ్‌గోపాల్‌ గుజ్జాల, కమలాకర్‌, నివాస్‌, హితేశ్‌, శ్రీను గడ్డం, బ్రహ్మ, వాసుదేవారెడ్డి తాళ్ల, శ్రీనివాసరెడ్డి పూసపాటి, సోమశేఖర్‌రెడ్డి, సత్య, కరుణాకర్‌, రాజ్‌, విష్ణు బుసిరెడ్డి, రామనంద కొండా, శ్రీనివాస్‌ యావసాని, వాసు మద్దిశెట్టి, శ్రీధర్‌ వన్నెంరెడ్డి, రమేశ్‌రెడ్డి, సత్య పాటిల్‌, శ్రీధర్‌ నాగిరెడ్డి, వేణు, సుధాకర్‌ ధనిరెడ్డి, వర్జీనియా నుంచి దిలీప్‌, నినాంద్‌, సత్య పాటిల్‌, వేణు గోపాల్‌లు విజయవంతంగా నిర్వహించారు. పాల్గొన్న సభ్యులందరికి అభినందనలు తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top