టెక్సాస్‌లో ‘యాత్ర’ సంబరాలు | Yatra Movie Success Celebrations By YSR Fans In Texas | Sakshi
Sakshi News home page

టెక్సాస్‌లో ‘యాత్ర’ సంబరాలు

Feb 11 2019 10:46 AM | Updated on Feb 11 2019 10:50 AM

Yatra Movie Success Celebrations By YSR Fans In Texas - Sakshi

టెక్సాస్‌ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. యాత్ర సినిమా విడుదలని ప్రపంచ వ్యాప్తంగా వైఎస్సార్ అభిమానులు పండుగ వాతావరణంలో జరుపుకొంటున్నారు. సినిమాను వీక్షించిన అభిమానులు సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

పాద‌యాత్ర‌లో భాగంగా నాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జ‌ల‌తో త‌న అనుబంధాన్ని ఎలా ఏర్ప‌ర్చుకున్నారనే విష‌యాన్ని.. ద‌ర్శ‌కుడు చాలా ఎమోష‌న‌ల్‌గా తెర‌కెక్కించార‌ని చెప్పారు. మహి వి రాఘవ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. ఒక మంచి భావోద్వేగ కథను చక్కగా చూపించారని  అభిప్రాయపడ్డారు. ఈ సినిమా వైఎస్ అభిమానుల‌కే కాకుండా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని, ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యే విధంగా తీశారని చెప్పారు. ఇక మమ్ముట్టి, వైఎస్సార్ పాత్రలో ఒదిగిపోయారని, వైఎస్సార్ ని మళ్ళీ చూసిన అనుభూతి కలిగిందని అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

ఆస్టిన్‌లోని వైఎస్సార్ అభిమానులు  సుబ్బా రెడ్డి చింతగుంట, పుల్లా రెడ్డి యెదురు, పరమేశ్వర రెడ్డి నంగి, మల్లికార్జున రెడ్డి ఆవుల, నారాయణ రెడ్డి గండ్ర, రవి బల్లాడ, కుమార్ అశ్వపతి, ప్రవర్ధన్ రెడ్డి చిమ్ముల, వంశి, వెంకట శివ నామాల, కొండా రెడ్డి ద్వారసాల, అశోక్ గూడూరు, స్వాదీప్ రెడ్డి, బ్రమేంద్ర రెడ్డి లక్కు, మురళీధర్ రెడ్డి బండ్లపల్లి, ప్రదీప్ రెడ్డి లక్కీరెడ్డి , రామ కోటి రెడ్డి , వెంకట గౌతమ్ , హనుమంత రెడ్డి , దేవేందర్ రెడ్డి, శివ రెడ్డి ఎర్రగుడి, వెంకట రెడ్డి కొండా, యస్వంత్ రెడ్డి గట్టికుప్పల, గురు చంద్రహాస్ రెడ్డి , శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ కొట్టే, రవి, రఘు, శ్రీను చింత, కళ్యాణ్ రెడ్డి , ప్రసాద్ రెడ్డి, చెన్నా రెడ్డి, విట్టల్ రెడ్డి, చెన్న కేశవ రెడ్డి తదితరులు యాత్ర సినిమాను చూసారు. అనంతరం యాత్ర సినిమా విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.






Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement