మలేషియాలో ‘యాత్ర’ టికెట్‌ రూ.90 వేలు | Yatra movie release celebrations held in Malaysia | Sakshi
Sakshi News home page

మలేషియాలో ‘యాత్ర’ టికెట్‌ రూ.90 వేలు

Feb 9 2019 9:03 AM | Updated on Feb 9 2019 9:04 AM

Yatra movie release celebrations held in Malaysia - Sakshi

కౌలాలంపూర్‌ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర కథాంశంగా నిర్మించిన ‘యాత్ర’ సినిమా రిలీజ్‌ వేడుకలు శుక్రవారం విదేశాల్లో ఘనంగా జరిగాయి. మలేషియాలో జరిగిన సినిమా విడుదల వేడుకల్లో పెద్ద ఎత్తున వైఎస్సార్‌ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా మొదటి టికెట్‌ వేలం వేయగా  5,250 రింగెట్స్‌ (ఇండియన్‌ కరెన్సీలో రూ.90 వేలు) పలికినట్లు వైఎస్సార్‌ అభిమాని చిలేకాంపల్లె విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. సింగపూర్‌లోనూ వైఎస్సార్‌ అభిమానులు సినిమా రిలీజ్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగపూర్‌లోని కార్నివాల్‌ షో టవర్స్‌లో జరిగిన యాత్ర సినిమా విడుదల వేడుకల్లో వైఎస్సార్‌ అభిమానులు పాల్గొని.. వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  

Advertisement
 
Advertisement
Advertisement