అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం | Telugu student died in boat crash take place in us | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

Mar 10 2018 10:56 AM | Updated on Apr 3 2019 5:24 PM

Telugu student died in boat crash take place in us - Sakshi

మృతుడు దేవినేని రాహుల్‌

సాక్షి, హైదరాబాద్‌ : సరదాగా బోటింగ్‌ కోసం వెళ్లిన అతడిని మృత్యువు కబళించింది. తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ సంఘటన అమెరికాలోని నార్త్‌ కరోలినా క్యారీలో చోటుచేసుకుంది. ఏపీకి చెందిన దేవినేని రాహుల్‌ (19) తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి సరదాగా బోటింగ్‌ కు వెళ్లాడు. అయితే ప్రమాదశావత్తు పడవ మునిగిపోవడంతో రాహుల్‌, అతని స్నేహితుడు నదిలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు  వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో రాహుల్‌ మృతి చెందగా, అతని స్నేహితుడు గాయపడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement