టాంటెక్స్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో సంక్రాంతి సంబరాలు | Tantex Sankranthi Festival On Grand Scale In Dallas | Sakshi
Sakshi News home page

టాంటెక్స్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో సంక్రాంతి సంబరాలు

Jan 30 2019 3:08 PM | Updated on Jan 30 2019 3:29 PM

Tantex Sankranthi Festival On Grand Scale In Dallas - Sakshi

ముత్యాల ముగ్గులు.. రత్నాల గొబ్బిళ్లు.. భోగిమంటలు.. పిండి వంటలు.. కొత్త అల్లుళ్లు.. కోడిపందేలు.. సంక్రాంతి వచ్చిందంటేనే సంబరం.. ఎక్కడ లేని ఉత్సాహం. ఊరికి, దేశానికి దూరంగా అమెరికాలో ఉన్న తెలుగు వారికి ఈ పండుగ అంటే ఇంకా మమకారం. అమెరికాలోని తెలుగువారు ప్రతి  పండుగను ఘనంగా జరుపుకొనేలా  తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సస్‌(టాంటెక్స్‌) ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు చేస్తుంటుంది. తెలుగు వారి సాంస్కృతిక వారధి, మూడు దశాబ్దాలకి పైబడి వారి మనసులు చూరగొంటున్న టాంటెక్స్ ఈసారి కూడా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. 

డల్లాస్‌/ఫోర్ట్ వర్త్ : తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సస్‌(టాంటెక్స్‌)  ఆధ్వర్యంలో స్థానిక ఫ్రిస్కో హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. అచ్చమైన తెలుగు వాతావరణాన్ని అణువణువునా ప్రతిబింబించే విధంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడ ముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో అమెరికాలోని తెలుగువారు సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. టాంటెక్స్‌ అధ్యక్షుడు చిన్న సత్యం వీర్నపు, కార్యక్రమ, సాంస్కృతికి సమన్వయ కర్తలు ప్రబంధ్‌ రెడ్డి తోపుడుర్థి, సమీర ఇల్లెందుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు సభా ప్రాంగణాన్ని అలంకరించారు. చిన్నారుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్థానిక బావార్చి ఇండియన్‌ రెస్టారెంట్‌ పసందైన పండుగ భోజనాన్ని వడ్డించింది. 

ఈ కార్యక్రమ ప్రసెంటింగ్ స్పాన్సర్స్ నితిన్ రెడ్డి శీలం, నాట్స్, ఇందిర అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ఈవెంట్ స్పాన్సర్స్ డా. ఉరిమిండి నరసిం హారెడ్డి,సుబ్రమణ్యం జొన్నలగడ్డ అండ్ ఫ్యామిలీ, మనోహర్ కసగాని, ఉమామహేష్ పార్నపల్లి అండ్ ఫ్యామిలీ, శరత్ రెడ్డి యర్రం, ప్లాటినం పోషక దాతలైన బావార్చి ఇండియన్ రెస్టారెంట్, ప్రసూనాస్ కిచెన్, క్వాంట్ స్విస్ టంస్,ఆల్బెర్ట్ సంతయ్య ఆఫ్ యెడ్వార్డ్ జోన్స్, విక్రం జంగం, డా. పవన్ పమడుర్తి, ప్రతాప్ భీమిరెడ్డి, శ్రీకాంత్ పోలవరపు, గోల్డ్ పోషక దాతలైన పసంద్ రెస్టారెంట్, విష్ పాలెపు సి.పి.ఏ, మైటాక్స్ ఫైలర్, మైటాక్స్ ఫైలర్, రాం కొనార, మెహతా జూలెర్స్, అడయార్ ఆనంద్ భవన్, బసేర ఇండియన్ రెస్టారెంట్, కిషొర్ చుక్కాల, సిల్వర్ పోషక దాతలైన సిం-పర్వతనేని- బ్రౌన్ లా ఆఫీసెస్, మురళి వెన్నం, డా. సుమన కేత, డా.భాస్కర్ రెడ్డి సానికొమ్ము, పెంటా బిల్డర్స్‌, టాంటెక్స్‌ మాజీ అధ్యక్షురాలు క్రిష్ణవేణి శీలంలకు చినసత్యం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. 

1
1/8

2
2/8

3
3/8

4
4/8

5
5/8

6
6/8

7
7/8

8
8/8

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement