టీఏజీకేసీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ | TAGC Bathukamma Celebrations held in Kansas | Sakshi
Sakshi News home page

టీఏజీకేసీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ

Oct 16 2018 11:51 AM | Updated on Oct 16 2018 11:59 AM

TAGC Bathukamma Celebrations held in Kansas - Sakshi

కాన్సాస్‌ : అమెరికాలోని కాన్సాస్‌లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటి (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక బ్లూవ్యాలీ నార్త్ వెస్ట్ హైస్కూల్‌లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు వెయ్యి మంది తెలుగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా నుండి వచ్చిన రఘు వేముల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సూపర్ సింగర్ ఫేమ్ అంజనా సౌమ్య, కాన్సాస్ సిటి స్థానిక సింగర్ శ్రియ పొందుర్తిలు తమ గాత్రంతో ఊర్రూతలూగించారు.


స్థానిక దేవాలయ పూజారి నిర్వహించిన బతుకమ్మ, అమ్మ వారి పూజలతో కార్యక్రమం ప్రారంభమయింది. నగరంలోని తెలుగు వారు అందరు సాంప్రదాయ వేషధారణలో తాము చేసిన బతుకమ్మలను తీసుకోని రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సాంస్కృతిని ప్రతిభింబించే జానపద, బతుకమ్మ పాటలను మహిళలు, యువతులు ఆడిపాడారు. బతుకమ్మలన్నింటిలో మంచి బతుకమ్మలను న్యాయ నిర్ణేతలు నిర్ణయించి, వారికి స్పాన్సర్స్ ద్వారా బహుమతులు అందజేశారు. అనంతరం బతుకమ్మలను తీసుకొని వెళ్లి నిమజ్జనం చేసి, ప్రసాదాలు పంచారు. కార్యక్రమం విజయవంతం కావటానికి కృషి చేసిన అందరికి టీఏజీకేసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.

1
1/7

2
2/7

3
3/7

4
4/7

5
5/7

6
6/7

7
7/7

Advertisement
 
Advertisement
Advertisement