తానా మహాసభలకు రాంమాధవ్‌కు ఆహ్వానం | Ram Madhav to attend TANA convention | Sakshi
Sakshi News home page

తానా మహాసభలకు రాంమాధవ్‌కు ఆహ్వానం

Jul 2 2019 2:35 PM | Updated on Jul 2 2019 3:10 PM

Ram Madhav to attend TANA convention - Sakshi

వాషింగ్టన్‌ : జూలై 5,6 తేదీల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలకు అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలోని వాల్టార్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌ ముస్తాబవుతోంది. తానా అధ్యక్షులు సతీష్‌ వేమన ఆధ్వర్యంలో జరుగనున్న 22వ తానా మహాసభలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ పాల్గోనున్నారు. అంతే కాకుండా ఆరో తేదీన జరగబోయే ఇండియా పొలిటికల్‌ ఫోరంలో కూడా పాల్గోనున్నారని ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బీజేపీ సభ్యులు డా. ఆడప ప్రసాద్‌ తెలిపారు. తానా మహాసభల ముగింపు కార్యక్రమంలో రాంమాధవ్‌ ప్రసంగించనున్నారని చెప్పారు. తానా అధ్యక్షులు సతీష్‌ వేమన, కన్వెన్షన్‌ కన్వీనర్‌ డా. వెంకట రావు ముల్పూరిలు రామ్‌ మాధవ్‌తోపాటూ, ముఖ్య అతిథులకు స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement