‘కబ్జా నుంచి ఉస్మానియా భూములను కాపాడండి’

Osmania alumni requets to save university lands - Sakshi

లండన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా కాకుండా కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉందని, ఉస్మానియా అలుమ్ని యూకే-యూరోప్ ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరింది. ‘డీడీ కాలనీలో ఆక్రమించిన ఉస్మానియా భూమిలో కట్టడాలు నిర్మించడం సరైంది కాదు. అసలు జీహెచ్ఎమ్‌సీ ఎలా అనుమతులు ఇచ్చిందో పునః పరిశీలన చేయాల్సిందిగా కోరుతున్నాము. అనేక సామాజిక ఉద్యమాలకు ఉస్మానియా యూనివర్సిటీ జీవం పోసింది. ఉస్మానియాను అన్ని విధాలుగా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంతో పాటు పూర్వ విద్యార్థులకు ఉంటుంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవ చూపి, ఉస్మానియా భూములపైన సమగ్ర సర్వే నిర్వహించాలి. భవిష్యత్తులో కబ్జాలు కాకుండా కట్టుదిట్టం చేయాలి. స్థానిక ప్రజలు కూడా ఉస్మానియాకి అండగా  నిలవాలి. పోలీస్ శాఖ అక్రమ కట్టడాలు జరగకుండా చూడాలి. అవసరం అయితే ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం ద్రుష్టికి కూడా తీసుకెళతాం’ అని ఉస్మానియా అలుమ్ని యూకే-యూరో ఫౌండర్ మెంబెర్, ఛైర్మెన్ గంప వేణుగోపాల్, ఫౌండర్ మెంబర్, అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, ఫౌండర్ మెంబర్, ప్రధాన కార్యదర్శి మహేష్ జమ్ముల తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top