త్వరలో వస్తానన్నాడు.. అంతలోనే.. | NRI Shot Dead Before His Planning A Trip Back Home In America | Sakshi
Sakshi News home page

Nov 18 2018 11:44 AM | Updated on Apr 4 2019 3:25 PM

NRI Shot Dead Before His Planning A Trip Back Home In America - Sakshi

టెన్సిపీ : అమెరికాలో తెలుగు వ్యక్తి సునీల్‌ ఎడ్ల (61) గురువారం రాత్రి హత్యకు గురైన సంగతి తెలిసిందే. సునీల్‌ మరో రెండు వారాల్లో సొంతూరుకు రావాల్సి ఉందని ఆయన బంధువులు వెల్లడించారు. ‘క్రిస్టమస్‌, తల్లి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు సునీల్‌ ఈ నెల (నవంబర్‌) 27న స్వస్థలానికి వచ్చేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. దాదాపు రెండు నెలల పాటు తమతో గడుపేందుకు వస్తున్నానీ చెప్పాడు’ అని ఆయన బంధువులు తెలిపారు. అంతలోనే ఈ ఘోరం జరిగిందని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. (అమెరికాలో ఎన్‌ఆర్‌ఐ హత్య)

కామర్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన సునీల్‌ 30 ఏళ్ల క్రితం అమెరికా వలస వచ్చాడు. అట్లాంటిక్‌ పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో ఆయన ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఘటన జరిగిన రోజు సునీల్‌ డ్యూటీ నిమిత్తం ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లేందుకు బయటకు రాగా.. 16 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు ఆయనను కాల్చి చంపారు. అంనతరం సునీల్‌కు చెందిన సబారు ఫోర్‌స్టర్‌ కారులోనే పరారయ్యారు. కాగా, అట్లాంటిక్‌సిటీ పోలీసులు నిందితులను పట్టుకుని జైలుకు తరలించారు. వారిపై హత్య, దోపిడీ నేరాలు మోపామని చెప్పారు. ఆయనకు భార్య మంజుల, ఇద్దరు కుమారులు ఉన్నారు. టెన్సీసీలోని వివిధ చర్చిలలో పాటలు పాడటం ద్వారా సునీల్‌ చాలా మందికి సుపరిచితులు. మెదర్‌ చర్చిలోనూ ఆయన చాలా సార్లు పాటలు పాడారని ఆయన బంధువులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement