హైదరాబాద్‌లో కజాక్ ప్రొఫెసర్ల బృందం పర్యటన

Hyderabad Tour Of Association Of University Of Republic Of Kazakhstan Professors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విద్య, వైద్య రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు భారత్, కజికిస్తాన్ ముందుకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కజికిస్తాన్ ప్రెసిడెంట్ ఫ్రొఫెసర్ అల్హనోవ్, డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పార్ట్‌నర్‌షిప్‌ ప్రొఫెసర్ అస్సన్‌తో కూడిన ప్రొఫెసర్ల బృందం సోమవారం హైదరాబాద్‌లో పర్యటించింది. వీరితో పాటు అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ కజికిస్తాన్ భారత అధికార ప్రతినిధి డాక్టర్ బి.వవ్య సునీతరాజ్, నియో సీఈఓ డాక్టర్ బీవీకే రాజ్ ఉన్నారు.

ఈ బృందం జేఎన్‌టీయూ హైదరాబాద్, ఉస్మానియా యూనిర్సిటీల వైస్ చాన్స్‌లర్లను అలాగే జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలిసింది. కజికిస్తాన్‌లో మొత్తం 3 వేలమంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తుండగా.. ఒక్క తెలంగాణ నుంచే 600 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలో వీరి కలయిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి మధ్య వైద్య, విద్య ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అనేక అంశాలు చర్చకు వచ్చాయి. కజాక్ లోని తెలంగాణ వైద్య విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని బృంద సభ్యులకు మంత్రి హామి ఇచ్చారు.

అలాగే కజికిస్తాన్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తెలంగాణ విద్యార్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించే ఆలోచనలు కూడా చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కజికిస్తాన్ రాజధాని ’ఆస్తానా‘ నగరంగా అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దేందుకు సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు.

అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్‌ ఎస్.రామచంద్రంతో పాటు, జేఎన్‌టీయూలో వీసీ, ప్రొఫెసర్ ఎ.వేణుగోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్స్, డైరెక్టర్లతో సమావేశమైన బృంద సభ్యులు. ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ, మేనేజ్ మెంట్ కోర్సుల్లో కజికిస్తాన్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు.. ఉస్మానియా తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు ప్రొఫెసర్ అల్హనోవో వెల్లడించారు. ఇందుకు ఉస్మానియా వీసీ, జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. అలాగే ఫ్యాకల్టీలను కూడా ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష పరిశోధన కేంద్రమైన బైక నోర్ కాస్మోడ్రామ్ లో అధ్యయనం చేసేందుకు ఉస్మానియా అధ్యాపక బృందాన్ని కజికిస్తాన్ ప్రతినిధి బృందం ఆహ్వానించింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top