ఘనంగా విమెన్స్‌ డే, ఆటా వార్షికోత్సవం

ATA And Women's Day Celebrated By ATA At Kentucky - Sakshi

కెంటకీ : అమెరికాలోని ఆటా(అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) ఆధ్యర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళ దినోత్సవం, ఆటా వార్షికోత్సవాన్ని కెంటకీ స్టేట్‌లోని లూసివిల్లెలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెంటకీ సెనెటర్‌ జూలీ ఆడమ్‌ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆటా కెంటకీ రిజనల్‌ కో-ఆర్డినేటర్‌ డా.మహేష్‌ కుమార్‌ గుండ్లూరు మాట్లాడుతూ.. కార్యక్రమానికి హాజరై, మహిళ దినోత్సవాన్ని, ఆటా వార్షికోత్సవాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 650 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. అలాగే తెలుగు సినిమా గాయని సునీతా తన పాటలతో అందరినీ అలరించారు. గుండ్లూరు కవితా, సరస్వతీ తూటుపల్లి, హేమప్రసాద్‌, కవితా, వెంకటేశ్వర రెడ్డి, రాజ గోపాల్‌ రెడ్డి, రమ్య, అనిల్‌, కృష్ణ, భారతి, శివ రామకోటి రెడ్డి, సుజిత్‌లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తోడ్పాటు అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో కెంటకీ నేషనల్‌ టీం లీడర్స్‌ చైర్మన్‌ డా. తిరుపతి రెడ్డి, కో చైర్మన్‌ శ్రీకాంత్‌ కోటగిరి, ఆటా అధ్యక్షులు కరుణాకర్‌ అసిరెడ్డి, ఆటా ట్రస్టీ అనిల్‌ బోడిరెడ్డి, వెబ్‌ కమిటీ చైర్మన్‌ ఉమేష్ ముత్యాల, రామకిృష్ణ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, నరేందర్‌ రెడ్డి, స్టాండింగ్‌ కమిటీ కో చైర్మన్‌ కిశోర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top