నిర్మల్‌లో ఘనంగా ఆటా వేడుకలు

American Telugu Association Conducting Celebrations In Nirmal  - Sakshi

నిర్మల్‌: అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌(ఆటా) అధ్వర్యంలో ఆటా వేడుకలు డిసెంబర్‌ 11న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ జెడ్‌పీ హైస్కూల్‌ను బుధవారం ఆటా బృందం సందర్శించింది. విద్యార్థులకు క్లాస్‌ రూం బెంచెస్‌, బ్యాక్‌ ప్యాక్‌ కిట్లను ఆటా బృందం విద్యార్థులకు పంపిణి చేసింది. అనంతరం కంటి పరీక్షలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆటా ప్రెసిడెంట్‌ పరమేశ్‌ బీంరెడ్డి, వేడుకలు చైర్మన్‌ భువనేశ్‌ భుజాలా, మధు బొమ్మినేని, అనిల్‌ బొడ్డిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆటా వేడుకలు డిసెంబర్‌ 29వరకు జరగనున్నాయి. ఆటా ప్రతి సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top