గంట నడిపితే ఆమె పైలెట్‌ అయ్యుండేదే | young trainee pilot dies in craft crash | Sakshi
Sakshi News home page

గంట నడిపితే ఆమె పైలెట్‌ అయ్యుండేదే

Apr 27 2017 4:35 PM | Updated on Sep 5 2017 9:50 AM

గంట నడిపితే ఆమె పైలెట్‌ అయ్యుండేదే

గంట నడిపితే ఆమె పైలెట్‌ అయ్యుండేదే

మరో గంట సేపు ఆమె గనుక ఫ్లైట్‌ నడిపితే లైసెన్స్‌డ్‌ పైలెట్‌ అయ్యేండేదే.

న్యూఢిల్లీ: మరో గంట సేపు ఆమె గనుక ఫ్లైట్‌ నడిపితే లైసెన్స్‌డ్‌ పైలెట్‌ అయ్యుండేదే. కానీ, విధి మరోలా ఉంది. 200 గంటల ఫ్లైట్‌ రికార్డును ఆమె చేరుకోలేకపోయింది. ఇక ఎన్నటికీ చేరుకోలేనంత దూరం వెళ్లిపోయింది. ఆమె నడుపుతున్న ప్లైట్‌ నేల కూలింది. ఈ ఘటనలో ఆమెతోపాటు ఆమె ఇన్‌స్ట్రక్టర్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రకు చెందిన హిమానీ కల్యాణి అనే ట్రైనీ పైలెట్‌ గురువారం తన ఇన్‌స్ట్రక్టర్‌ కెప్టెన్‌ రంజన్‌ గుప్తాతో కలిసి గోండియా జిల్లా బిర్సి ఎయిర్‌పోర్టు నుంచి డీఏ 42 రకం ఎయిర్‌క్రాఫ్ట్‌లో బయలుదేరింది. ఉదయం 9.40గంటలకు బయలుదేరిన దాదాపు ఇరవై నిమిషాల పాటు సవ్యంగానే విమానం ప్రయాణించింది. అనుకోకుండా ఆ విమానం అదుపు తప్పటంతో సురక్షితంగా నేలపై దిగేందుకు హిమానీ కల్యాణి యత్నించింది. ఈ క్రమంలో విమానం రెక్క రోప్‌వేకు తాకటంతో అదుపుతప్పి వైగంగా నది సమీపంలో నేల కూలింది. ఈ ఘటనలో హిమానీతోపాటు రంజన్‌గుప్తా అక్కడికక్కడే చనిపోయారు.

కల్యాణి శిక్షణ గురువారంతో ముగియనుంది. నిబంధనల ప్రకారం 200 గంటల పాటు ఆమె విమానం నడపాల్సి ఉంది. కల్యాణి ఇప్పటివరకు 199 గంటలు నడిపింది. ఇంకో గంటపాటు ఆమె విమానం నడిపినట్లయితే లైసెన్సుకు అర్హురాలై ఉండేది. అనంతరం ఆమె ప్రైవేట్‌ వాణిజ్య విమాన పైలెట్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఉండేదని శిక్షణ కళాశాల వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై పౌరవిమాన యాన శాఖ దర్యాప్తు ప్రారంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement