న్యూఢిల్లీ: వైద్యపరంగా ఆరోగ్యంగా కనిపించే వ్యక్తులలో కూడా దాగివున్న గుండె సంబంధిత ప్రమాదాలపై కొత్త ఆందోళనను రేకెత్తిస్తోంది. గుండెపోటుతో 40 ఏళ్ల ఎయిరిండియా పైలట్ (ఫస్ట్ ఆఫీసర్) కుప్పకూలిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ఇండోనేసియాలోని బాలీలో హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే అతనికితీవ్ర గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.
న్యూఢిల్లీ నుంచి ఇండోనేషియాలోని బాలికి బయలుదేరిన అంతర్జాతీయ విమానానికి పైలట్‌గా వ్యవహరించారు. డ్యూటీలో అనంతరం హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటుండగా గుండెలో తీవ్రమైన అసౌకర్యానికి గురికాగా, బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. మెరుగైన వైద్య చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, తీవ్రమైన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి : సీనియర్ నటి పిల్లలకు భారీ ఊరట
ఎయిరిండియా స్పందన
తమ పైలట్ మరణం పట్ల ఎయిరిండియా యాజమాన్యం విచారం వ్యక్తంచేసింది. ఆయన కుటుంబానికి తగిన సాయం అందిస్తామని ప్రకటించింది. బాధితుడి వివరాలను బయటపెట్టలేదు. విమానయాన సంస్థల నిబంధనల ప్రకారం పైలట్ ఇటీవలే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తేలింది.


