అవును.. పొరపాట్లు చేశాం: కేజ్రీవాల్‌ | 'Yes, We Made Mistakes, Will Introspect': Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

అవును.. పొరపాట్లు చేశాం: కేజ్రీవాల్‌

Apr 30 2017 1:55 AM | Updated on Sep 5 2017 9:59 AM

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కొన్ని పొరపాట్లు చేసిందని ఢిల్లీముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒప్పుకున్నారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కొన్ని పొరపాట్లు చేసిందని ఢిల్లీముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒప్పుకున్నారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి స్పందించిన సీఎం.. కొన్ని పొరపాట్లు జరిగాయని, వాటిని పరిశీలించుకుని సరిదిద్దుకుంటామని శనివారం ట్వీటర్‌లో పేర్కొన్నారు.

‘రెండ్రోజులుగా పార్టీ వలంటీర్లు, ఓటర్లతో మాట్లాడా. పరిస్థితి తెలుస్తోంది. అవును.. మేం పొరపాట్లు చేశాం. వాటిని సరిదిద్దుకుంటాం. చేతల్లో చూపించాల్సిన సమయం ఇది. ఓటర్లకు, కార్యకర్తలకు రుణపడి ఉన్నాం’ అని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీ మహానగరంలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 270 సీట్లకుగాను బీజేపీ 181, ఆప్‌ 48, కాంగ్రెస్‌ 30 సీట్ల గెలుపొందిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement