
ప్రియమైన బాపూ.. నువ్వే ప్రేరణ!
జాతిపిత మహాత్మాగాంధీకి లేఖ రాయాలనుకుంటున్నారా..?
⇒ ఉత్తరం రాయండి.. బహుమతి గెల్చుకోండి
⇒ ప్రధాని సూచనతో తపాలా శాఖ వినూత్న కార్యక్రమం
⇒ ఉత్తమ లేఖకు సర్కిల్ స్థాయిలో రూ.25 వేలు.. జాతీయ స్థాయిలో రూ.50 వేలు
⇒ గాంధీ జయంతి రోజున సబర్మతి ఆశ్రమంలో అందజేత
సాక్షి, హైదరాబాద్:
జాతిపిత మహాత్మాగాంధీకి లేఖ రాయాలనుకుంటున్నారా..? అయితే ఆయన జీవి తం మీకు ఎలా ప్రేరణ కలిగించిందో ఓ ఉత్తరం రాయండి.. అది ఆకట్టుకునేలా ఉంటే సబర్మతి ఆశ్ర మానికి చేరుకుంటుంది. మీకు నగదు పురస్కారం దక్కుతుంది! ఈ మేరకు తపాలా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన సమయంలో మహాత్ముడి చిత్రాలతో ఉన్న కొన్ని తపాలా కవర్లను విడుదల చేశారు. ఆ సందర్భంగా మహాత్ముడిని జనం మరోసారి తలచుకోవటంతోపాటు ఉత్తరాలు రాసే మధుర జ్ఞాపకాన్ని నెమరేసుకోవటం ఒకేసారి జరిగేలా ఓ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తపాలా శాఖకు సూచించారు.
దీంతో ‘ప్రియ బాపూ... నువ్వే నా ప్రేరణ’ పేరుతో తపాలా శాఖ ఓ కార్య క్రమానికి శ్రీకారం చుట్టింది. మహాత్ముడి ప్రేరణ ప్రభావాన్ని స్వీయానుభవంలో వివరిస్తూ ఆగస్టు 15లోపు తెలం గాణ సర్కిల్ తపాలా చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్‌కు చేరేలా ఉత్తరం స్వదస్తూరీతో రాసి పంపాలి. వాటి ల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి మూడు నగదు పురస్కారాలను తపాలా శాఖ అందించనుంది. వా టిని జాతీయ స్థాయి పురస్కార ఎంపికకు కూడా పంపుతుంది. అక్కడ ఎంపికైతే మరో దఫా పుర స్కారం వరిస్తుంది. అలా ఉత్తమమై నవి సబర్మతి ఆశ్రమానికి చేరుకుంటాయి. అక్కడ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున వాటిని ప్రదర్శించ టంతోపాటు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
పోటీ ఇలా...
ఈ పోటీ రెండు వయసుల వారికి ఉంది. 18 ఏళ్లలోపు వారు, అంత కంటే ఎక్కువ వయసున్న వారికి విడివిడిగా ఏర్పాటు చేశారు. ఇన్‌లాండ్ లెటర్‌లో అయితే 500 పదాలకు మించకుండా, ఏ4 సైజ్ కాగితంలో అయి తే వెయ్యి పదాలకు మించకుండా వ్యాసం రాసి రూ.5 పోస్టు కవర్‌లో ఉంచి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్, డాక్ సదన్, అబిడ్స్ హైదరాబాద్, 500001 చిరునామాకు పంపాలి. గాంధీజీని ఉద్దేశిస్తూ తమ జీవితంలో ఆయన ఎలా స్ఫూర్తి నింపారో రాయాలి. దాంతోపాటు వయసు పేర్కొంటూ స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాలి.
బహుమతులు ఇలా..
సర్కిల్ స్థాయిలో మొదటి ఉత్తమ లేఖకు రూ.25 వేలు, రెండో లేఖకు రూ.10వేలు, మూడో ఉత్తమ లేఖకు రూ.5వేలు నగదు బహుమతి ఉంటుం ది. ఇది రెండు వయసుల వారికి విడివిడిగా ఉంటుంది. ఇవి జాతీయ స్థాయి లో మళ్లీ ఎంపికైతే మొదటి ఉత్తమ లేఖకు రూ.50 వేలు, 25 వేలు, రూ.10 వేలు బహుమతి ఉంటుంది. అక్టోబర్ 2న వాటిని సబర్మతి ఆశ్రమంలో ప్రద ర్శిస్తారు. ఇందుకు పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఇన్‌లాండ్ లెటర్లను, పెన్నులను ఉచితంగా అందించాలని నిర్ణయించారు. దాదాపు 3 నుంచి 5 లక్షల లేఖలను సిద్ధం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.