మహారాష్ట్రలో ‘సతి’ ఘటన! | women commits sati in maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో ‘సతి’ ఘటన!

Apr 2 2015 4:20 AM | Updated on Oct 8 2018 5:45 PM

భర్త చితిపై కాలిన స్థితిలో భార్య మృతదేహం కనిపించిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

భర్త చితిపై కాలిన స్థితిలో భార్య మృతదేహం కనిపించిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

లాతూర్ జిల్లా లోహత గ్రామంలో ఆదివారం తుకారాంమానే(55) చనిపోయాడు. అనంతరం దహన క్రియలు నిర్వహించారు. సోమవారం మృతదేహం పాక్షికంగా కాలిపోయి కనిపించడంతో.. మళ్లీ దహనం చేశారు. అయితే, అనారోగ్యంతో ఉన్న తుకారాం భార్య ఉష(50) సోమవారం రాత్రి నుంచి  కనిపించకుండా పోయింది. మంగళవారం ఉదయం తుకారాం అస్థికల కోసం చితి వద్దకు వెళ్లిన బంధువులకు చితిపై సగం కాలిపోయిన స్థితిలో ఉష మృతదేహం కనిపించింది. మరో చితిని ఏర్పాటుచేసి ఆమెకు దహన క్రియలు పూర్తి చేశారు. ఉష సతీ సహగమనానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement