ఆ ఇద్దరు శిశువులకు ఒకే గుండె! | Woman gives birth to 'Siamese twins' in Maharashtra Aurangabad | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు శిశువులకు ఒకే గుండె!

Jun 19 2016 8:07 PM | Updated on Oct 8 2018 6:22 PM

అచ్చంగా మన వీణావాణీల్లాగానే మహారాష్ట్రలో కూడా తల భాగంలో అతుక్కుని ఒకే గుండె, ఒకే లివర్‌తో పుట్టారు అవిభక్త కవల పిల్లలు.

ఔరంగాబాద్‌: అచ్చంగా మన వీణావాణీల్లాగానే మహారాష్ట్రలో కూడా తల భాగంలో అతుక్కుని ఒకే గుండె, ఒకే లివర్‌తో పుట్టారు అవిభక్త కవల పిల్లలు. వీరికి మహారాష్ట్రలో ఆదివారం ఓ 22 ఏళ్ల మహిళ జన్మనిచ్చింది. సస్తూర్‌ గ్రామానికి చెందిన తస్లీన్‌ మసుల్దార్‌ అనే మహిళ లాతూరులోని ఔరంగాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ ఆస్పత్రిలో ప్రసవించేందుకు చేరింది. ఆమె అవిభక్త కవల పిల్లలకు జన్మనిచ్చినట్టు ఆస్పత్రి వైద్యుడు ఒకరు మీడియాకు వెల్లడించారు.

పుట్టిన ఆ ఇద్దరు శిశువులకు రెండు చేతులు, రెండు కాళ్లు, రెండు తలలు అతుక్కుని ఉండగా, ఒకే లివర్‌, ఒకే గుండె ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే అవిభక్త కవల పిల్లలకు జన్మనిచ్చిన తల్లి తస్లీన్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement