భర్తను బంధించి భార్యపై సామూహిక అత్యాచారం | Woman gangraped by four, husband held hostage | Sakshi
Sakshi News home page

భర్తను బంధించి భార్యపై సామూహిక అత్యాచారం

Dec 1 2014 1:13 PM | Updated on Sep 2 2017 5:28 PM

భర్తను బంధించి భార్యపై సామూహిక అత్యాచారం

భర్తను బంధించి భార్యపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. నలుగురు దుండగులు భర్తను బంధించి అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బదాన్: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. నలుగురు దుండగులు భర్తను బంధించి అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బదాన్ జిల్లా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

శనివారం భార్యాభర్తలిద్దరూ ఆస్పత్రికి వెళ్లి.. ఆ రోజు రాత్రి వారి గ్రామానికి తిరిగి వెళ్తుండగా మోటారు సైకిల్పై వచ్చిన దుండగులు అడ్డగించారు. భార్యాభర్తలను అడవిలోకి బలవంతంగా లాక్కెళ్లారు. భర్తను బంధించి యువతిపై దారుణానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement