యోగి సభలో ముస్లిం మహిళ బుర్ఖా విప్పించారు..! | Sakshi
Sakshi News home page

యోగి సభలో ముస్లిం మహిళ బుర్ఖా విప్పించారు..!

Published Wed, Nov 22 2017 1:40 PM

 Woman asked to remove burqa at Yogi Adityanath's rally in Uttar Pradesh - Sakshi - Sakshi - Sakshi - Sakshi

బాలియా: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభలో ఓ ముస్లిం మహిళా కార్యకర్తకు చేదు అనుభవం ఎదురైంది. సభకు హాజరైన ఆ మహిళ బుర్ఖాను తొలగించాలని పోలీసులు ఆదేశించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఈఘటనపై బాలియా ఎస్పీ అనిల్ కుమార్ స్పందించారు.  అయితే మహిళను బుర్ఖా తొలగించించాలన్న ఈ ఘటనకు సంబంధించి తమకు సమాచారం అందలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సభలో ఎవరూ నల్లటి వస్త్రాలు చూపరాదన్న ఆదేశాలు ఉన్నాయని మాత్రం తెలిపారు.  ఈ ఘటనపై విచారణ చేపట్టి సరైన చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు బుర్ఖాను ఎందుకు తొలగించాలని పోలీసులు...ఎందుకు ఆదేశించారో తనను  తెలియదని ఆ ముస్లి మహిళ పేర్కొంది. అయితే ఆ మహిళతో పాటు ఆమె భర్త కూడా బీజేపీ కార్యకర్తలే కావడం గమనార్హం. కాగా ఆదివారం మీరట్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సభలో కొందరు సీఎం యోగికి వ్యతిరేకంగా నల్ల జెండాలను చూపించారు. అయితే ఆ ఆందోళన కారులను ... బీజేపీ కార్యకర్తలు చితకబాదారు. మళ్లీ అలాంటి ఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ముస్లిం మహిళను బుర్ఖా తొలగించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement