వాట్సప్‌లో డిజిటల్‌ పేమెంట్స్! | WhatsApp to enter digital payments segment: Co-founder Brian Acton | Sakshi
Sakshi News home page

వాట్సప్‌లో డిజిటల్‌ పేమెంట్స్!

Feb 25 2017 8:42 AM | Updated on Sep 28 2018 3:31 PM

వాట్సప్‌లో డిజిటల్‌ పేమెంట్స్! - Sakshi

వాట్సప్‌లో డిజిటల్‌ పేమెంట్స్!

మెసెజింగ్‌ యాప్‌ వాట్సప్‌లో యూజర్లు తమ నగదు లావాదేవీలను నిర్వహించుకునేలా మరో అదనపు ఫీచర్‌ కూడా చేరబోతోందా

న్యూఢిల్లీ: మెసెజింగ్‌ యాప్‌ వాట్సప్‌లో యూజర్లు తమ నగదు లావాదేవీలను నిర్వహించుకునేలా మరో అదనపు ఫీచర్‌ కూడా చేరబోతోందా? అంటే అవుననే అంటున్నారు సంస్థ కో ఫౌండర్‌ బ్రియాన్‌ యాక్టన్‌. అయితే ఈ విషయంలో వాట్సప్‌ ఇప్పుడిప్పుడే కసరత్తులు ప్రారంభించిందని.. ఈ ఫీచర్‌ అందుబాటులోకి రావడానికి మరికొంతకాలం పడుతుందని తెలుస్తోంది. భారత పర్యటనకు వచ్చిన యాక్టన్‌.. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్‌ ఇండియా కోసం ప్రభుత్వం కృషి బాగుందని ఆయన కితాబిచ్చారు.

మాజీ యాహూ ఉద్యోగులు జాన్‌ కౌమ్‌, బ్రియాన్‌ యాక్టన్‌ 2009లో ప్రారంభించిన వాట్సప్‌.. శుక్రవారం ఎనిమిదో సంవత్సరంలోకి ప్రవేశించింది. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌కు 1.2 బిలియన్ల మంది యాక్టీవ్‌ యూజర్లు ఉన్నారు. ఇందులో భారత్‌లోనే 200 మిలియన్ల యూజర్లు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement