కోటి రూపాయల లాటరీ.. భయంతో పోలీసుల వద్దకు!

West Bengal Lottery Winner Goes To Cops For Protection - Sakshi

కోల్‌కతా: రాత్రికి రాత్రి లాటరీ ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. 70 సంవత్సరాల వయసున్న ఆ వ్యక్తి పేరు నిన్నటి వరకూ ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడాయన పేరు పశ్చిమ బెంగాల్ లో మారు మోగుతోంది. ఆయనే ఇందిరా నారాయణన్. గత ఆదివారం ఆయనను కోటి రూపాయల లాటరీ వరించింది. దీంతో జీవితంలో ఎన్నడూ చూడనంత డబ్బు వచ్చి పడే సరికి.. వాటితో పాటు కష్టాలు కూడా వచ్చేశాయి. లాటరీ తగిలిందన్న విషయం తెలియగానే తమకు కొంత డబ్బులు ఇవ్వాలంటూ.. అతనికి బెదిరింపులు, ఒత్తిడులు పెరిగాయి. దీంతో ప్రాణ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించాడు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను అభ్యర్థిస్తున్నాడు.

చదవండి: '79 ఏళ్ల వయసులో ఏడుగురిని చిత్తు చేసింది'

కాగా, ఇటీవల గుప్తిపారా మార్కెట్లో మింటూ బిశ్వాస్ అనే లాటరీ సెంటర్ యజమాని వద్ద టికెట్ కొన్నాడు. రూ. 60 పెట్టి, 10 నాగాలాండ్ స్టేట్ లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. తర్వాత దాన్ని ఇంటికి తీసుకెళ్లి మర్చిపోయాడు. లాటరీ ఫలితాలు కూడా చూడలేదు. తనకు టికెట్లను అమ్మిన లాటరీ సెంటర్ యజమాని మింటూ బిశ్వాస్.. తనకు ఫోన్‌ చేసి డబ్బులు వచ్చిన విషయాన్ని చెప్పాడని.. తన షాప్ నుంచి కొన్న టికెట్లకు బహుమతి వచ్చిందని.. షాపు యజమానిక ద్వారానే తనకు విషయం తెలిసిందని చెప్పాడు. లాటరీ తగిలిందని తెలిసినప్పటి నుంచి తనకు బెదిరింపులు ప్రారంభం అయ్యాయని.. అందుకే ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరుతున్నానని చెప్పారు.

చదవండి: ఏడాదిలో రూ.750 కోట్లు వసూళ్లు రాబట్టిన స్టార్‌హీరో

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top