సర్వేలు ప్రతికూలంగా ఉన్నా, మాదే విజయం: సోనియా | We will win, says Sonia Gandhi | Sakshi
Sakshi News home page

సర్వేలు ప్రతికూలంగా ఉన్నా, మాదే విజయం: సోనియా

Mar 26 2014 2:15 PM | Updated on Mar 18 2019 9:02 PM

సర్వేలు ప్రతికూలంగా ఉన్నా, మాదే విజయం: సోనియా - Sakshi

సర్వేలు ప్రతికూలంగా ఉన్నా, మాదే విజయం: సోనియా

దేశవ్యాప్తంగా ఒపీనియన్ సర్వేల ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా... కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గెలుస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒపీనియన్ సర్వేల ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా... కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గెలుస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో సర్వేలు పలుమార్లు తప్పు అని రుజువయ్యాయని మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ అన్నారు. 
 
గతంలో 2004లో కూడా యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒపీనియన్ సర్వేల హోరెత్తించాయి. కాంగ్రెస్ పనైపోయిందని చెప్పాయి. అయితే కాంగ్రెస్ విజయం సాధించింది అని సోనియా తెలిపారు. అలాగే 2009 కూడా ఓడిపోతామని చెప్పినా.. గెలిచి చూపించాం. గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి అని అన్నారు. 
 
ఈసారి కూడా కాంగ్రెస్, యూపీఏ గెలిచి తీరుతుందని సోనియా విశ్వాసం ప్రకటించారు. కాంగ్రెస్ శ్రేణులు పోరాటానికి సిద్ధమయ్యారు. మేం విజయం సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement