రైల్లో ఊహించని పరిణామం.. వీడియో వైరల్‌

 Water gushes from AC duct in Sanghamitra Superfast Express Video Goes Viral - Sakshi

ఇళ‍్ళల్లోని ఏసీ నుంచి వాటర్‌  లీక్‌ కావడం  అప్పుడప్పుడూ అందరికీ ఎదురయ్యే  సంఘటనే. అయితే  మనం ప్రయాణిస్తున్న రైలు బోగీలోని ఏసీ నుంచి సడెన్‌గా వరద పారితే..ఒక్కసారిగా ఆందోళన పుట్టదూ...! సంఘమిత్ర  సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇలాంటి  చేదు అనుభవమే ఎదురైంది.  ఏసీ కోచ్‌లోని ఏసీ లోంచి అకస్మాత్తుగా వరదలాగా నీరు ఉబికి వచ్చింది.  ఈ   ఊహించని పరిణామానికి బోగిలో గందరగోళ పరిస్థతి ఏర్పడింది. ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఆందోళనకు  లోనయ్యారు.  ముఖ్యంగా ఆయా బెర్త్‌లలోని సీనియర్‌ సిటిజన్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రయాణీకుల్లో ఒకరు రికార్డు చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top