జిరాఫీని రెచ్చగొడితే ఇలానే ఉంటుంది!

న్యూఢిల్లీ : తలుపులు మూసి కొడితే పిల్లి కూడా పులిలా విరుచుకుపడుతుందన్నట్లు.. కోపం వస్తే ఏ జంతువైనా తిరగబడటం కామన్. సాధు జంతువులు కూడా ఇందుకేమీ మినహాయింపు కాదు. పొడుగు కాళ్ల జీవి జిరాఫీకి కోపం తెప్పిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. దాన్నుంచి తప్పించుకుని పరిగెడదామన్నా కూడా ఆ ఛాన్స్ మనకు ఉండదు. ఎందుకంటే మనం 20 అడుగులు వేస్తే అది ఒక అడుగు వేస్తుంది! పిక్కబలంతో టక్కున పట్టేసుకుంటుంది. తాజాగా జిరాఫీ కోపానికి సంబంధించిన ఓ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుధా రమెన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ( వైరల్: పాము నీళ్లు తాగడం ఎప్పుడైనా చూశారా? )
దీనిపై ఆమె స్పందిస్తూ..‘‘ జిరాఫీ కాళ్లు ఎంత దృఢమైనవో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఒక్క దెబ్బతో మనిషిని మట్టి కరిపిస్తుంది. అలుపు లేకుండా అవి చాలా వేగంగా పరిగెత్తగలవు. ఫేస్‌బుక్‌లో చూసిన వీడియో’’ అని పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు..‘‘తర్వాత ఏమైంది? సగం వీడియోతో ఆత్రుత ఎలా వస్తుంది.. జురాసిక్ పార్క్ సినిమా చూసినట్లుంది. జిరాఫీతో గొడవ పెట్టుకోకండి. జిరాఫీని రెచ్చగొడితే ఇలానే ఉంటుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( పీక్కుతింటున్నా.. 5 గంటల పాటు ఓపికగా )
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి