‘భారతమాత ముద్దుబిడ్డకు శతకోటి ప్రణామాలు’ | Vijayasaireddy applauds Abhinandan Varthaman | Sakshi
Sakshi News home page

‘భారతమాత ముద్దుబిడ్డకు శతకోటి ప్రణామాలు’

Mar 1 2019 7:17 PM | Updated on Mar 1 2019 7:25 PM

Vijayasaireddy applauds Abhinandan Varthaman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాక్‌ చెర నుంచి విడుదలై మాతృభూమిపై అడుగుపెట్టిన భారత వాయుసేన(ఐఏఎఫ్‌) పైలట్, వింగ్‌ కమాండర్‌ వర్ధమాన్‌ అభినందన్‌పై దేశవ్యాప్తంగా అభినందనల వర్షం కురుస్తోంది. అసాధారణ ధైర్య సాహసాలతో, భూమికి వేల అడుగుల ఎత్తులో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడి శత్రు విమానాలను తరిమికొట్టిన అభినందన్‌ దేశభక్తి నిరుపమానమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. కోట్లాది భారతీయులకు నిండైన స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. క్షేమంగా తిరిగి వచ్చిన ఆ భారతమాత ముద్దు బిడ్డకు నా శతకోటి ప్రణామాలు అని ట్విట్టర్లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement