మంత్రులకు డివిజన్ల బాధ్యతలిచ్చిన సీఎం | Vasundhara Raje makes ministers incharge of state divisions | Sakshi
Sakshi News home page

మంత్రులకు డివిజన్ల బాధ్యతలిచ్చిన సీఎం

Jun 17 2014 3:32 PM | Updated on Sep 2 2017 8:57 AM

మంత్రులకు డివిజన్ల బాధ్యతలిచ్చిన సీఎం

మంత్రులకు డివిజన్ల బాధ్యతలిచ్చిన సీఎం

ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలువుతున్నాయో, లేవో పర్యవేక్షించేందుకు.. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఒక్కో మంత్రికి ఒక్కో డివిజన్ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు.

ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలువుతున్నాయో, లేవో పర్యవేక్షించేందుకు.. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఒక్కో మంత్రికి ఒక్కో డివిజన్ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ఏడు డివిజన్లకు ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా నియమించారు. జైపూర్, భరత్పూర్, బికనీర్, అజ్మీర్, జోధ్పూర్, ఉదయ్ పూర్, కోట.. ఈ ఏడు డివిజన్లు కలిపి మొత్తం 33 జిల్లాల్లో ఉన్నాయి.  

మంత్రులతో పాటు ప్రధాన శాఖలకు సంబంధించిన కార్యదర్శులకు కూడా ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. ఇంధనశాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖివ్సర్కు జైపూర్ డివిజన్, విద్యాశాఖ మంత్రి కేసీ సరాఫ్కు భరత్పూర్, వ్యవసాయశాఖ మంత్రి ప్రభులాల్ సైనీకి బికనీర్, సామాజిక న్యాయశాఖ మంత్ర అరుణ్ కుమార్కు అజ్మీర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జీసీ కటారియాకు జోధ్పూర్, పీడబ్ల్యుడీ శాఖ మంత్రి యూనస్ ఖాన్కు కోటా డివిజన్ బాధ్యతలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement