అసలైన జాతీయగీతం.. వందేమాతరం | vande mataram is the real national anthem, says bhayyaji joshi | Sakshi
Sakshi News home page

అసలైన జాతీయగీతం.. వందేమాతరం

Apr 2 2016 2:34 PM | Updated on Sep 3 2017 9:05 PM

అసలైన జాతీయగీతం.. వందేమాతరం

అసలైన జాతీయగీతం.. వందేమాతరం

'భారత్ మాతాకీ జై' నినాదం తాలూకు వివాదం ఇంకా చల్లారక ముందే మరో వివాదం మొదలైంది. అసలైన జాతీయగీతం జనగణమణ కాదని, వందేమాతరమే అసలైన జాతీయ గీతమని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి అన్నారు.

'భారత్ మాతాకీ జై' నినాదం తాలూకు వివాదం ఇంకా చల్లారక ముందే మరో వివాదం మొదలైంది. అసలైన జాతీయగీతం జనగణమణ కాదని, వందేమాతరమే అసలైన జాతీయ గీతమని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి అన్నారు. ప్రస్తుతం జనగణమణ మన జాతీయ గీతమని, అందువల్ల దాన్ని గౌరవించాల్సిందేనని, అయితే సరైన అర్థం తీసుకుంటే వందేమాతరమే మన జాతీయ గీతం కావాలని ఆయన అన్నారు. ముంబైలో దీన దయాళ్ ఉపాధ్యాయ రీచ్ సంస్థలో మాట్లాడుతూ ఆయనీ విషయం తెలిపారు. అయితే రాజ్యాంగం ప్రకారం జనగణమణ ఉంది కాబట్టి దాన్నే మనం కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు.

జనగణమణ ఎప్పుడో రాశారని, కానీ అందులో అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాశారని భయ్యాజీ జోషి అన్నారు. వందేమాతరంలో మాత్రం దేశ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించారని చెప్పారు. ఈ రెండింటి మధ్య తేడా ఇదేనని, రెండింటినీ గౌరవించాల్సిందేనని ఆయన తెలిపారు. వందే మాతరం అంటే.. భరతమాతకు వందనం అని అర్థం. దీన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ రాశారు. ఇది స్వాతంత్ర్య సమరం సమయంలో కీలకపాత్ర పోషించింది. 1950లో దీని మొదటి రెండు పాదాలను కలిపి జాతీయ గేయంగా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement