వాజ్‌పేయి అస్థికలు యూపీ నదుల్లో నిమజ్జనం

Vajpayees Ashes To Be Immersed In Rivers In All UP Districts - Sakshi

లక్నో: భారత మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి అస్థికలను ఉత్తర్‌ప్రదేశ్‌(యూపీ)లోని అన్ని జిల్లాల్లో ఉన్న నదుల్లో నిమజ్జనం చేయనున్నట్లు ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఈ విషయాన్ని ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వయంగా వెల్లడించారు. వాజ్‌పేయి కర్మభూమి ఉత్తర్‌ ప్రదేశ్‌ అని వ్యాఖ్యానించారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి వాజ్‌పేయి అంతిమ యాత్రలో భాగస్వాములు అయ్యారని పేర్కొన్నారు.

లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి వాజ్‌పేయి 1991 నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. బీజేపీ లక్నో నగర శాఖ ఆగస్టు 21న సంతాప సభ నిర్వహిస్తుందని, దానికి ప్రస్తుత లక్నో ఎంపీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరవుతున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. యూపీలో పేద ప్రజలు నివాసముండే వింటర్‌ షెల్టర్‌లకు మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు పెట్టాలని స్థానిక బీజేపీ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top