
రాయగడ టౌన్‌హాల్‌లో వాజ్‌పేయి చిత్రపటం వద్ద ఉంచిన చితాభస్మం కలశం
రాయగడ : దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి చితాభస్మం కలశం సోమవారం రాయగడకు చేరుకుంది. ప్రజల సందర్శనార్థమై రాయగడ టౌన్‌హాల్‌లో దీనిని ఉంచారు. ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యుడు పూర్ణచంద్ర మజ్జి మాట్లాడుతూ జిల్లాలోని కాశీపూర్, టికిరి ప్రాంతాలతో సహా కల్యాణ సింగుపురం, తేరువలి, బిసంకటక్, మునిగుడ, అంబొదల, రామన్నగుడ, పద్మపూర్, గుడారి, ప్రాంతాల్లో వాజ్‌పేయి చితాభస్మ కలశం ఊరేగింపు నిర్వహిస్తామన్నారు.
అనంతరం ఈ నెల 29వ తేదీన జిల్లాలోని వంశధార నదీ తీరంలో నిమజ్జనం చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు కాశీరాం మజ్జి, రజిత్ మదల, శ్రీపాల్ జైన్, ఎం.రామారావు, భాస్కర పండా, సుమంత మహరణ, తిలక్ చౌదరి, వసంత ఉల్క, చిత్త ప్రధాన్, జోగేశ్వర్ చౌదరి, గౌరి ఇతర సభ్యులు పాల్గొన్నారు.