కరతాళ ధ్వనులతో అంతిమ వీడ్కోలు

Uttar Pradesh: Crowd Gathers Outside House of CRPF Personnel - Sakshi

లక్నో: అమరవీరుడికి తుది వీడ్కోలు పలికేందుకు లాక్‌డౌన్‌ను సైత్యం లెక్కచేయకుండా జనం తండోప తండాలు తరలివచ్చారు. దేశం రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుడిని కడసారి చూసేందుకు ప్రజలు వెల్లువలా వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని సీఆర్‌పీఎఫ్‌ కార్యాలయానికి బుధవారం భారీ సంఖ్యలో జనం పోటెత్తారు. ఉగ్రవాదుల దాడిలో అమరుడైన సీఆర్‌పీఎఫ్‌ జవాను అశ్వినికుమార్‌ యాదవ్‌కు అంతిమ వీడ్కోలు పలికేందుకు ప్రజలంతా సీఆర్‌పీఎఫ్‌ కార్యాలయం ముందు గుమిగూడారు. పెద్ద చప్పట్లు చరుస్తూ, నినాదాలు చేస్తూ అతడిని అంజలి ఘటించారు. అశ్వినికుమార్‌ అంత్యక్రియలు అతడి సొంతూరైన ఘాజిపూర్‌లో ఈరోజు నిర్వహించనున్నారు. (కరోనా: అతడిని ప్రశ్నించిన పోలీసులు)

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సైనికులు అమరులయ్యారు. అశ్వినికుమార్‌తో పాటు సంతోష్‌కుమార్‌ మిశ్రా, చంద్రశేఖర్‌ అనే సైనికులు మరణించారు. ఈ ముగ్గురికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ట్విటర్‌ ద్వారా నివాళులు అర్పించారు. దేశం కోసం ఈ ముగ్గురు అమరవీరులు చేసిన త్యాగం సాటిలేనిదని, వీరిని చూసి తామంతా గర్విస్తున్నామని ట్వీట్‌ చేశారు. కుటుంబ భారాన్ని మోస్తున్న అశ్వినికుమార్‌ మరణంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. (హిజ్‌బుల్ టాప్ క‌మాండ‌ర్ దిగ్బంధం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top