జూన్‌ 5న యూపీఎస్సీ పరీక్ష తేదీల ప్రకటన | UPSC Civil Services Prelims date announcement likely on June 5 | Sakshi
Sakshi News home page

జూన్‌ 5న యూపీఎస్సీ పరీక్ష తేదీల ప్రకటన

May 21 2020 6:04 AM | Updated on Apr 17 2021 6:47 PM

UPSC Civil Services Prelims date announcement likely on June 5 - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగాల్సిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీలకు సంబంధించి వివరాలు వచ్చే నెల 5న ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) బుధవారం సమాచారమిచ్చింది. పరీక్షల నిర్వహణపై చర్చించేందుకు బుధవారం యూపీఎస్సీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ నెల 31న జరగాల్సిన పరీక్షలు లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతమున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం లేదని, అందుకే వాయిదా వేస్తున్నట్లు మే 4న చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement