సివిల్స్‌ నోటిఫికేషన్‌ జారీ

UPSC Civil Services 2020 Notification Released - Sakshi

కశ్మీర్‌ అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు లేదు!

న్యూఢిల్లీ: ఈ సంవత్సరం(2020) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాస్తున్న జమ్మూకశ్మీర్‌ యువతకు గరిష్ట వయోపరిమితి విషయంలో మినహాయింపు ఇవ్వడం లేదు. గత సంవత్సరం 1980–89 మధ్య అప్పటి జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో శాశ్వత నివాసులైన సివిల్స్‌ అభ్యర్థులకు ఐదేళ్ల గరిష్ట వయోపరిమితిని 32 ఏళ్ల నుంచి ఐదేళ్ల పాటు పెంచారు. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఆ సడలింపును ఎత్తేశారు.

796 ఖాళీలతో 2020 సంవత్సర సివిల్స్‌ పరీక్షల నోటిఫికేషన్‌ను బుధవారం యూపీఎస్సీ జారీ చేసింది. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వారికి ఐదేళ్లు, ఇతర వెనకబడిన వర్గాల వారికి మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి మార్చి  3 ఆఖరి తేది. పరీక్షకు మూడు వారాలు ముందు అభ్యర్థులకు అడ్మిట్‌ కార్డులు జారీ చేస్తారు. మరిన్ని వివరాలకు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://upsconline.nic.in/ చూడొచ్చు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top