‘తుపాను’లోనూ సైకిల్‌ రయ్‌ రయ్‌! | UP CM Akhilesh Yadav promises voters maximum pension cover | Sakshi
Sakshi News home page

‘తుపాను’లోనూ సైకిల్‌ రయ్‌ రయ్‌!

Feb 7 2017 2:01 AM | Updated on Mar 29 2019 9:31 PM

‘తుపాను’లోనూ సైకిల్‌ రయ్‌ రయ్‌! - Sakshi

‘తుపాను’లోనూ సైకిల్‌ రయ్‌ రయ్‌!

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ ‘తుపాను’లోనూ ఎస్పీ సైకిల్‌ను ఎలా ముందుకు పోనివ్వాలో పార్టీ శ్రేణులకు తెలుసని సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

మోదీ వ్యాఖ్యపై సీఎం అఖిలేశ్‌
సీతాపూర్‌/లఖింపూర్‌ ఖేరి: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ ‘తుపాను’లోనూ ఎస్పీ సైకిల్‌ను ఎలా ముందుకు పోనివ్వాలో పార్టీ శ్రేణులకు తెలుసని సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. సీతాపూర్, లఖింపూర్‌ ఖేరిల్లో సమాజ్‌వాదీ పార్టీ నిర్వహించిన ప్రచార సభల్లో అఖిలేశ్‌ మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ చేయి కలపడంతో ఎస్పీ సైకిల్‌ వేగం పెరగనుంది. స్నేహహస్తమిచ్చిన కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లిచ్చాం. ఎన్నికల్లో బీజేపీ ‘తుపాను’ దెబ్బకు సీఎం ఎగిరిపోతారని మోదీ అంటున్నారు. కానీ అంతటి గాల్లోనూ సైకిల్‌ సవా రీ ఎలాగో సమాజ్‌వాదీలకు తెలుసు. యూ పీలో అధికారపక్షానికి వ్యతిరేకంగా బలమైన గాలులు వీస్తున్నాయని మోదీ భావిస్తే, పంజాబ్‌లో కూడా అధికారపక్షానికి వ్యతిరేకంగా గాలులువీస్తున్నాయనే విషయం మోదీ గుర్తుంచుకోవాలి’ అని అన్నారు.

ములాయం ప్రచారం: ఎస్పీ–కాంగ్రెస్‌ కూట మిపై మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న ఎస్పీ అగ్రనేత ములాయంసింగ్‌ ‘యూ టర్న్‌’ తీసుకున్నారు. రేపటి నుంచి అఖిలేశ్‌ తరఫున ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement