ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే..! | Union Budget 2020 Cheaper And Costlier Articles | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ 2020: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే..!

Feb 1 2020 2:44 PM | Updated on Feb 1 2020 2:57 PM

Union Budget 2020 Cheaper And Costlier Articles - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో ఫర్నీచర్‌, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎ​క్సైజ్‌ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరుగనున్నాయి. వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్‌ సెస్‌, ఆటో మెబైల్‌ విడి భాగాలపై కస్టమ్స్‌ సుంకం పెరిగింది. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌పై కేంద్రం పన్ను తగ్గించింది. అదే విధంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు, మొబైల్‌ ఫోన్ల విడిభాగాలకు పన్ను తగ్గించింది. ప్లాస్టిక్‌ ఆధారిత ముడి సరుకు కస్టమ్స్‌ పన్నును సైతం తగ్గించింది.(బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌)

ధరలు పెరిగేవి
ఫర్నీచర్‌
చెప్పులు
సిగరెట్లు
పొగాకు ఉత్పత్తులువైద్య పరికరాలు
కిచెన్‌లో వాడే వస్తువులు
క్లే ఐరన్‌
స్టీలు
కాపర్‌
సోయా ఫైబర్‌, సోయా ప్రోటీన్‌
కమర్షియల్‌ వాహనాల విడిభాగాలు
స్కిమ్డ్‌ మిల్క్‌
వాల్‌ ఫ్యాన్స్‌
టేబుల్‌వేర్

ధరలు తగ్గేవి
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌
ఎలక్ట్రిక్‌ వాహనాలు
మొబైల్‌ ఫోన్ల విడిభాగాలు
ప్లాస్టిక్‌ ఆధారిత ముడి సరుకు

Advertisement
 
Advertisement
Advertisement