‘సాంస్కృతిక వారసత్వ సంపద’గా కుంభమేళా

UNESCO recognises Kumbh Mela as India's cultural heritage - Sakshi

న్యూఢిల్లీ: కుంభమేళాను ‘సాంస్కృతిక వారసత్వ సంపద’గా ప్రపంచ వారసత్వ సంస్థ యునెస్కో గుర్తించింది. ఈ మేరకు యునెస్కో ట్విటర్‌లో వెల్లడించింది. సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ 12వ సమావేశాలు దక్షిణ కొరియాలోని జెజూలో డిసెంబర్‌ 4న ప్రారంభమయ్యాయి. డిసెంబర్‌ 9న ముగియనున్నాయి. ప్రపంచంలోనే  ఎక్కువ మంది భక్తులు శాంతియుతంగా హాజరయ్యే సమ్మేళనంగా కుంభమేళాకు పేరు. ‘కుంభమేళాను సాంస్కృతిక వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడం  గర్వించదగ్గ విషయం’ అని సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌ శర్మ అన్నారు. ఈ గుర్తింపుతో ప్రజలు తమ వారసత్వాన్ని కొనసాగించడమే కాకుండా కాపాడుకోవడానికి ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తుంది.

Back to Top