తస్మాత్‌ జాగ్రత్త.. ఫేక్‌ యూనివర్సిటీలివే..!

UGC Releases Fake Universities In India Most In Uttar Pradesh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో 23 ఫేక్‌ యూనివర్సిటీలు కొనసాగుతున్నాయని ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ వెల్లడించింది. ఆ జాబితాను మంగళవారం విడుదల చేసింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఇలాంటి విద్యాసంస్థల పట్ల  విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. డిగ్రీ కాలేజీలుగా గుర్తింపు పొందిన ఆయా సంస్థలు అక్రమంగా విశ్వవిద్యాలయాలుగా చలామణి అవుతున్నాయని వివరించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 8, ఢిల్లీలో 7 నకిలీ విశ్వవిద్యాలయాలున్నట్టు తెలిపింది.

రాష్ట్రాల వారీగా ఫేక్‌ యూనివర్సిటీల జాబితా..
ఢిల్లీ:
1. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్
2. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం
3. ఒకేషనల్ యూనివర్శిటీ
4. ఏడీఆర్-సెంట్రిక్ జురిడికల్ విశ్వవిద్యాలయం, ఏడీఆర్ హౌస్, 8 జె, గోపాల్‌ టవర్, 25 రాజేంద్ర ప్లేస్, న్యూఢిల్లీ -110008.
5. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, న్యూఢిల్లీ
6.విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌. ఇండియా రోజ్‌గార్ సేవాసదన్, 672, సంజయ్ ఎన్‌క్లేవ్‌ ఎదురుగా. జీటీకే డిపో, న్యూ న్యూఢిల్లీ -110033.
7. ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (స్పిరిచ్చువల్‌ యూనివర్సిటీ), 351-352, ఫేజ్-1, బ్లాక్-ఎ, విజయ్ విహార్, రిథాలా, రోహిణి, న్యూఢిల్లీ -110085.

కర్ణాటక :
8. బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, గోకాక్, బెల్గాం (కర్ణాటక)

కేరళ
9. సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం, కిషానట్టం

మహారాష్ట్ర :
10. రాజా అరబిక్ విశ్వవిద్యాలయం, నాగ్‌పూర్.

పశ్చిమ బెంగాల్ :
11. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆల్టర్‌నేటివ్‌ మెడిసిన్, 80, చౌరింఘీ రోడ్, కోల్‌కతా -20.
12. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆల్టర్‌నేటివ్‌ మెడిసిన్ అండ్ రీసెర్చ్, 8-ఎ, డైమండ్ హార్బర్ రోడ్, బిల్టెక్ ఇన్ 2 వ అంతస్తు, కుర్పుకుర్, కోల్‌కతా -700063.

ఉత్తర్‌ప్రదేశ్‌ :
13. వారణాసియా సంస్కృత విశ్వవిద్యాలయ, వారణాసి(యూపీ)/జగత్‌పురి, ఢిల్లీ.
14. మహిళాగ్రామ్‌ విద్యాపీఠ్‌/విశ్వవిద్యాలయ,(మహిళా) యూనివర్సిటీ, ప్రయాగ్‌రాజ్‌
15. గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్‌రాజ్, ఉత్తర్‌ప్రదేశ్‌.
16. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్, ఉత్తర్‌ప్రదేశ్.
17. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విశ్వవిద్యాలయం (ఓపెన్ విశ్వవిద్యాలయం), అచల్తాల్‌, అలీఘర్‌
18. ఉత్తర్‌ప్రదేశ్ విశ్వవిద్యాలయ, కోషి కలాన్, మధుర
19. మహారాణా ప్రతాప్‌ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ప్రతాప్‌ఘర్‌
20. ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, కోహోడా, మకాన్పూర్, నోయిడా ఫేజ్ -2.

ఒడిశా :
21. నవభారత్ శిక్షా పరిషత్, అనుపూమా భవన్, ప్లాట్ నెంబర్ 242, పానీ టాంకి రోడ్, శక్తినగర్, రూర్కెలా -769014.
22. నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ రోడ్ బారిపాడ, మయూరభంజ్ జిల్లా, ఒడిశా -757003.

పుదుచ్చేరి..
23. శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, నెం. 186, తిలాస్‌పేట్, వజుతావూర్ రోడ్, పుదుచ్చేరి -605009.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top