తప్పిన భారీ విమాన ప్రమాదం

Two IndiGo Planes Narrowly Escaped From Collision In Bangalore Airspace - Sakshi

సాక్షి బెంగళూరు: బెంగళూరు గగనతలంలో భారీ విమాన ప్రమాదం తప్పింది. బెంగళూరు గగనతలంలో రెండు ఇండిగో ఏ–320 విమానాలు ఒకదాన్నొకటి ఢీకొనబోయి తృటిలో తప్పించుకున్నాయి. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు బెంగళూరు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో రెండు విమానాల్లో కలిపి 330 మంది ప్రయాణికులున్నారు.

ఈ నెల 10న కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే 6ఈ–779 విమానం, బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లే 6ఈ–6505 విమానం బెంగళూరు నగర గగనతలంలో ఒకదాని కొకటి దగ్గరగా రావడాన్ని గుర్తించిన కెంపేగౌడ ఎయిర్‌పోర్టులోని ట్రాఫిక్‌ కొలిషన్‌ అవాయిడెన్స్‌ సిస్టమ్‌ అధికారులు రెండు విమానాల పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top