ఆకతాయికి స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చిన చిన్నమ్మ

Troll Tells Sushma Swaraj Waiting for Your Death - Sakshi

న్యూఢిల్లీ: ట్విటర్‌లో యాక్టీవ్‌గా ఉండే ప్రముఖుల్లో సుష్మా స్వరాజ్‌ ముందు వరుసలో ఉంటారు. ఆపదలో ఉండి సాయం కోరే వారి విషయంలో తక్షణమే స్పందించే సుష్మా స్వరాజ్‌.. కామెంట్‌ చేసే వారికి కూడా దిమ్మ తిరిగే సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ట్విటర్‌ వేదికగా చోటు చేసుకుంది. నిన్న ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాంగే రామ్ మరణించారు. ​ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. సుష్మా స్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది.

అయితే ఇర్ఫాన్‌ ఖాన్‌ అనే ఓ ప్రబుద్ధుడు సుష్మా ట్వీట్‌పై స్పందిస్తూ.. ‘షీలా దీక్షిత్‌ లానే మిమ్మల్ని కూడా ఏదో రోజు దేశమంతా తల్చుకుంటుంది అమ్మా’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ నెల 20న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. చనిపోయాక సుష్మాజీని కూడా అలానే తల్చుకుంటారని చెప్తూ ఇర్ఫాన్‌ ట్వీట్‌ చేశాడు. దీనిపై స్పందించిన సుష్మా స్వరాజ్‌ అతనికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. ‘నా గురించి ఇంత అత్యున్నతమైన ఆలోచన చేసినందుకు నీకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు. సుష్మా సమాధానం పట్ల నెటిజన్లు ఆనందం వ్యక్తం చేయడమే కాక ఇర్ఫాన్‌ను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top