ఆధార్‌’తో నా సమాచారం బయటికి రాలేదు: ఆర్‌ఎస్‌ శర్మ 

TRAI Chairman RS Sharma Reacts On Aadhaar Challenge - Sakshi

న్యూఢిల్లీ: ‘ఆధార్‌ చాలెంజ్‌’తో తనకు సంబంధించిన సమాచారమేదీ బహిర్గతం కాలేదని ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ తెలిపారు. కీలకమైన విధానపర నిర్ణయాలను చర్చించేందుకు సోషల్‌ మీడియా తగిన వేదిక కాదని పేర్కొన్నారు. తన వివరాలు బయటపెట్టాలని సవాలు విసురుతూ శర్మ ఆధార్‌ సంఖ్యను వెల్లడించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఈ మెయిల్‌ సమాచారాన్ని సంపాదించినట్లు కొందరు నెటిజెన్లు ప్రకటించగా, అలాంటిదేం లేదని శర్మ కొట్టిపారేశారు. ట్రాయ్‌ చైర్మన్‌గా నేడు పదవీ విరమణ పొందనున్న శర్మ బుధవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఆధార్‌ వల్ల నా వ్యక్తిగత సమాచారమేదీ బయటికి రాలేదు. వెల్లడైనట్లుగా చెబుతున్న ఆ వివరాలను ఆధార్‌ లేకుండానే తెలుసుకోవచ్చు. ఆధార్‌ సవాలును నేనే విసిరినట్లు భావిస్తున్నారు. అది నిజం కాదు. ఒకరు విసిరిన సవాలుకు స్పందించానంతే’అని అన్నారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top